ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు
-అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం.
– వెంకటాపురం మండల ఆర్యవైశ్య సంఘం హర్షం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఆర్య వైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ డం పట్ల ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల ఆర్యవైశ్య సంఘం ఏ.పీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు నిర్వహిం చారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మహర్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్యుల కుల దైవంగా ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి, అధికారికంగా నిర్వర్తించటం పట్ల ఆర్యవైశ్య సంఘం అభినంద నలు తెలిపారు.