ఘనంగా హోలీ వేడుకలు – పాల్గొన్న ఎస్పి కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎస్పి కిరణ్ ఖర్ పాల్గొని, పోలిసు అధికారులు, సిబ్బంది, పాత్రికే యులతో కలిసి నృత్యాలు చేసి హోలీ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలిసు అధికారులు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు చాటి చెబుతా యని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. భారతదేశంలో మనం జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవని. ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుం టున్నారని తెలిపారు. ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియ జెప్పాల్సిన అవసరం ఉందని, హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్పి ఖరే సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. సంపత్ రావు, కాటారం డిఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి, కాటారం, చిట్యాల, మహాదేవ్ పూర్ సిఐలు నరేష్ కుమార్, నాగార్జునరావు, మల్లేష్, రాజేశ్వర్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్ లు నగేష్, కిరణ్, రత్నం, జిల్లా పరిధిలోని ఎస్ ఐలు, పాత్రికేయులు, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.