బ్రిలియంట్ స్కూల్లో వైభవంగా గ్రీన్ డే
– పచ్చదనం ప్రాధాన్యత చాటిన విద్యార్థులు
ములుగు ప్రతినిధి, జులై 19, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో “గ్రీన్ డే మరియు సాంస్కృతిక కార్యక్రమం” ప్రిన్సిపల్ సంతోష్ ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు ఆకుపచ్చ దుస్తులు ధరించి, పచ్చి కూరగాయలు, ఆకులు, ఆకుపచ్చ బెలూన్లతో హాల్ ను హరిత వాతావరణంగా మలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు పలు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రకృతిని కాపాడు కోవాలని సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించాలని ప్రిన్సిపల్ సంతోష్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రీన్ డే ను పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.