Governor | గవర్నర్ కు ములుగులో ఘన స్వాగతం
– జిల్లాలో కొనసాగుతున్న పర్యటన
ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటన లో భాగంగా మంగళవారం ఉదయం ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ రోడ్ మార్గంలో ములుగు జిల్లా కు అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లు పూల మొక్కలను అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం రోడ్డు మార్గం గుండా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా ములుగు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.