అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు : మంత్రి శ్రీహరి

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు : మంత్రి శ్రీహరి

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు : మంత్రి శ్రీహరి

నారాయణపేట, ఆగస్టు1, తెలంగాణజ్యోతి: ప్రజల అవసరా లను ముందుకు ఉంచుకొని పనిచేసే ప్రజా ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నా మని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉట్కూర్ మండలానికి 1261 రేషన్ కార్డులు, 122 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, అలాగే భూమి కోల్పోయిన 14 రైతులకు మొత్తం రూ.50 లక్షల విలువైన నష్టపరిహార చెక్కులు పంపిణీ చేశారు.మీకు రేషన్ కార్డులు, ఇండ్లు, పింఛన్లు రావాలంటే ఎవరినైనా అడగాల్సిన అవసరం లేదు అర్హులైతే ఖచ్చితంగా మీకు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఇండ్ల నిర్మాణాల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే నేరుగా తనను సంప్రదించాలంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఉట్కూర్ సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే మండలం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. “గత పాలకులు వరి వేసినా ఉరి అని బెదిరించారు. కానీ ఇప్పుడు వరి వేసిన వారికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందించాం. మక్తల్ నియోజకవర్గానికి మాత్రమే రూ.39 కోట్లు బోనస్, రూ.363 కోట్లు రుణమాఫీ లభించాయని వివరించారు. ప్రతి నెల ఉట్కూర్ మండలంలోని రేషన్ లబ్ధిదారులకు బియ్యం పంపిణీకి రూ.1.40 కోట్లు, ఉచిత విద్యుత్ బిల్లులకే రూ.40 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి వడ్డీలేని రుణాలతో పాటు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు వంటి ఆదాయ వనరులు కూడా కల్పించామని వివరించారు. “నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. పేదల బతుకుల బాధ నాకు తెలుసు. మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి న్యాయం చేయడం నా బాధ్యత అని మంత్రి శ్రీహరి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment