అటవీశాఖ కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలి

Written by telangana jyothi

Published on:

అటవీశాఖ కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలి

– అటవీశాఖ అక్రమ భూకబ్జాలు షెడ్యూల్ ఏరియాలో చెల్లవు

– ప్రభుత్వ భూములను రక్షించడం లో రెవిన్యూ శాఖ పూర్తిగా విఫలం  

– ప్రభుత్వ భూములు లేకపోతే విద్యా సంస్థలను ఎక్కడ నిర్మిస్తారు..?

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : షెడ్యూల్ ప్రాంత భూములను రక్షించడంలో రెవిన్యూశాఖ పూర్తిగా విఫలమ యిందని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వ భూములన్నీ అటవీ శాఖ ఒక వైపు ఆక్రమిస్తూ ఉంటే, మరో ప్రక్క వలస గిరిజనేతరులు ఆక్రమించు కుంటున్నారని ఆరోపించారు. ఏజేఏసి తరుపున ఎన్నో రోజులు గా రెవిన్యూ, అటవీ శాఖలు జాయింట్ సర్వే నిర్వహించాలని కోరగా ఎట్టకేలకు బుధవారం సర్వే నెంబర్ 27 లో తూ తూ మంత్రంగా సర్వే నిర్వహించినారని ఉయిక శంకర్, కొర్స నర్సిం హా మూర్తి, పూనెం సాయి తెలిపారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అటవీ శాఖా తమ ఇష్టాను సారంగా ఆక్రమించారని మండిపడ్డారు. వెంకటాపురం మండలానికి ఇంటిగ్రెటెడ్ పాఠశాల, గిరిజన గురుకులం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వస్తే మండల కేంద్రంలో ఎక్కడ భూమి లేదని రెవెన్యూ శాఖ చెప్పడం సిగ్గు చేటన్నారు. అక్రమంగా అటవీ శాఖా, వలస గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు లేవని, గిరిజన గురుకుల పాఠశాలను వాజేడు మండలానికి తరలించడం పైన, ఏ జే ఏ సి నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల విద్యాభివృద్ధి కోసం వచ్చిన గిరిజన గురుకులానికి స్థలం లేదనడం ఏమిటని వారు ప్రశ్నించారు. గిరిజనులను విద్యకి దూరం చేసే కుట్ర జరుగు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖా అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మా భూమి అని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి లు ఉత్తరం వైపున్న రిజర్వుడ్ ఫారెస్ట్ అన్నారు. ఇది మాత్రమే గెజిట్ అయిందన్నారు. ఆ గెజిట్ రికార్డ్స్ తెచ్చి దక్షణం వైపున్న ప్రభుత్వ భూమికి సంబంధించింది అని, అటవీ శాఖా అధికారులు బుకాయిస్తూ ఉన్నారని అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలకు విరుద్ధంగా 27 సర్వే నెంబర్ భూమిని కబ్జా చేసినట్టు తెలిపారు. షెడ్యూల్డ్ భూములను ఇతరులకు బదలాయించాలి అంటే పెసా గ్రామసభ అనుమతి అవసరం తప్పనిసరి అన్నారు. ఇలాంటి దుశ్చర్యలను ఎల్ టి ఆర్ చట్టం ఒప్పుకోదని వివరిం చారు.సమతా జడ్జిమెంట్ లో సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాం గాన్ని వ్యాఖ్యనిస్తూ షెడ్యూల్ ఏరియాలో ఎటువంటి భూ బద లాయింపులు చెల్లవని తెలిపినట్లు నాయకులు గుర్తు చేశారు. అభివృద్ధి లో భాగంగా భవన నిర్మాణాలు అవసరం అనివార్యం అన్నారు. విద్యాసంస్థల నిర్మాణానికి యాభై ఎకరాల ప్రభుత్వ భూమి, 27 వ సర్వే నెంబర్ లో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెసా గ్రామసభ ఆమోదం లేకుండా ఎల్ టి ఆర్ చట్టానికి వ్యతిరేఖంగా అటవీ శాఖా తీసుకున్న వందలాది ఎకరాల భూములను తక్షణమే వెనక్కి తీసుకొని రేపటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అటవీ శాఖా అక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తక్షణమే వెనక్కి ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం అవుతామని ఏ. జే. ఏ .సి నాయకులు హెచ్చరించారు. కొమరం భీమ్ కాలనీ ఆదివాసీల భూములను తీసుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకో బోమని అన్నారు. జి ఎస్పీ కార్యనిర్వాహన జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల ఉపాధ్యక్షులు కుంజ మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now