గంగను చేరిన గౌరమ్మ.. ముగిసిన పూల సింగిడి…

గంగను చేరిన గౌరమ్మ.. ముగిసిన పూల సింగిడి...

గంగను చేరిన గౌరమ్మ.. ముగిసిన పూల సింగిడి…

– ములుగులో వైభవంగా బతుకమ్మ వేడుకలు

– తోగుంట వద్ద మహిళలతో కలిసి ఆడిపాడిన మంత్రి సీతక్క

ములుగు, సెప్టెంబర్ 30, తెలంగాణ జ్యోతి : తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు మహిళలు, యువతులు గౌరమ్మను వివిధ రూపాల్లో కొలుచుకొని బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. చివరి రోజు మంగళవారం సమీపంలోని చెరువులు, కుంటల వద్దకు చేరుకొని చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా మహిళలం తా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడారు. కోలాటం, డీజే నృత్యాలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. తీరొక్క పూలు, తంగేడు, గునుగు, బంతి తదితర రంగు రంగుల పూలు పేర్చి నూతన వస్త్రాలు ధరించి వేడుకలు చేసుకున్నారు. ములుగులోని తోగుంట వద్ద మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన కట్టపై భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం సత్తు, నువ్వుల పిండి, వాయినాలు ఇచ్చిపుచ్చుకొని ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తోగుంట వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ.. బతుకమ్మా కోల్.. ఉయ్యాల పాటలు అడి సందడి చేశారు. వేడుకల అనంతరం తోగుంటలో బతుకమ్మ లను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్ రావు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ సిబ్బందితో విద్యుత్ వెలుగు, తాగునీరు, స్వాగత తోరణాలు, బతుకమ్మ పాటలు తదితర భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, బతుకమ్మ వేడుకల కోసం రాష్ట్ర మంత్రి సీతక్క తోగుంట వెళ్లే రోడ్డును ములుగు జిల్లా ఆస్పత్రి నుంచి రూ.4కోట్లతో 15రోజుల క్రితం ప్రారంభించ గా అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

– ములుగు ఆడబిడ్డలతో బతుకమ్మ ఆడితేనే సంబురం

– వచ్చే పండుగ వరకు చెరువు రూపురేఖలు మార్చవేస్తానన్న మంత్రి

రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ములుగు ఆడబిడ్డలతో బతుకమ్మ ఆడకుంటే పండుగ జరుపుకున్నట్లుగా ఉండదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం ములుగులోని తోగుంట జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరైన మంత్రి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. అందరినీ పలకరిస్తూ ప్రతీ సమూహం వద్ద ఆగి వారితో బతుకమ్మ పాటలకు పాదం కలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే బతుకమ్మ పండుగ వరకు తోగుంట చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామని, రూపురేఖలు మార్చి మరింత అద్బుతంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుం దామన్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుభిక్షం గా, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షిం చారు. ఈ సందర్భంగా ములుగుకు చెందిన గంగిశెట్టి శ్రీనివాస్ తన తల్లి జ్క్షాపకార్థం తీరొక్క సహజసిద్ధమైన పూలతో పేర్చిన బతుకమ్మ లకు మూడు బహుమతులు, మొక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మణ్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment