నేటి నుండి శ్రీ క్షేత్రం రామయ్యకు గోటి తలంబ్రాలు.
ములుగు, తెలంగాణ జ్యోతి : శ్రీ రామ నవమి వేడుకల్లో భాగంగా ములుగులోని శ్రీ సీతారామచంద్రస్వామి (శ్రీ క్షేత్రం) ఆలయంలో గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్ర కోట కుమార్ ఆధ్వర్యంలో సీతారాములకు గోటి తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో తోటరాద, ఓదెల సరళ, కుందోజ్వల శారద,సూర లావణ్య, జెల్ల రజిత,కొత్తకొండ అశ్విత, తోకల స్వరూప, తోకల భవ్య, ఇమ్మడి లక్ష్మి తదితరులు పాల్గొనగా, మహిళలు గోటితో వడ్లు వలిచి తలంబ్రాలను తయారు చేస్తున్నారు. నవమి వేడుకల కోసం ఈ కార్యక్రమం ఈ నెల 16వరకు కొనసాగుతుందని వెల్లడించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.