సౌత్ ఇండియా కరాటేలో బిట్స్ స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్
ములుగు, ఆగస్టు3, తెలంగాణజ్యోతి : ఖమ్మంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా డబ్ల్యూ ఎఫ్ ఎస్ కె ఓ కరాటే ఛాంపియన్షిప్ – 2025లో ములుగు జిల్లా బిట్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో ములుగు ఎస్సై చవల్ల హేమచంద్ర కుమారుడు చవల్ల హేమచంద్ర శ్రీయాన్ (5వ తరగతి), కుమార్తె చవల్ల హీత్విక మోక్ష శ్రీ (3వ తరగతి) తలపెట్టిన విభాగాల్లో గోల్డ్ మెడల్స్‌ను గెలుచుకున్నారు. ఇద్దరూ ములుగు బిట్స్ స్కూల్లో చదువుతూ కరాటేలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. తమకు మార్గదర్శకత్వం అందిస్తున్న గురు శిక్షకులకు, పాఠశాల నిర్వహణకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న ఈ విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.