గోదావరి ఇసుక దొంగలను పట్టుకున్న పోలీసులు.
– అధిక లోడు ఇసుక లారీలు పట్టివేత, కేసులు నమోదు
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ప్రభుత్వ అనుమతి డీ.డీ.ల కంటే అధికలోడుతో తరలిస్తున్న ఏడు ఇసుక లారీలను ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీసులు పట్టుకున్నారు. వెంకటాపురం మండలంలోని కొండాపురం, మొర్ర వాని గూడెం తో పాటు,ఇతర ఇసుక ర్యాంపులు నుండి ,మరియు వెంకటాపురం మండల సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుబ్బంపేట గోదావరి ఇసుక ర్యాంపుల నుండి ప్రభుత్వ అనుమతి డీడీల కంటే ఒక్కొక్క లారీలో ఐదు నుండి ఆరు టన్నుల అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న లారీలను వెంకటాపురం పోలీసులు పట్టుకున్నారు. సంబంధిత వివరాలను వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ మీడియాకు తెలిపారు. ఎస్సై అశోక్ కధనం ప్రకారం..శనివారం సాయంత్రం వెంకటాపురం చర్ల రహదారి మండ ల పరిధిలోని మొర్రవానిగూడెం గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, అతివేగంగా వస్తున్న ఇసుక లారీలను నిలిపి వేసి తనిఖీలు నిర్వహించారు. ఒక్కొక్క లారీలో ఐదు నుండి ఆరు టన్నుల ఇసుక అధికంగా లోడు ఉన్నట్లు గుర్తించారు. అధిక లోడ్ ఇసుక లారీలను వెంకటాపురం పోలీస్ స్టేషన్ కు తరలించా రు. చట్ట ప్రకారం ఆయా ఇసుక లారీలపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై అశోక్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి డీ.డీ.లకంటే అధికంగా ఇసుకను ఓవర్ లోడ్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇసుక తరలించే లారీలపై కేసులు ను చట్ట ప్రకారం నమోదు చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఎస్.ఐ. హెచ్చరించారు. వెంకటా పురం, వాజేడు మండలాల్లోని అనేక ఇసుక రాంపులలో అదనపు బకెట్లతో ప్రభుత్వ ఖజానాకు ఇసుక మాఫియా తూట్లు పొడుస్తు న్నారు. ఒక్కొక్క బకెట్ కి రెండు వేల రూపాయలు చొప్పున వసూళ్ళు చేసి ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టి, ఇసుక మాఫియా లక్షల, కోట్ల రూపాయలు గిరిజనుల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు, నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాఇ. దీంతో పోలీస్ శాఖను ప్రబుత్వం అప్రమత్తం చేశారు. ఈ మేరకు వెంకటాపురం మండలంలో ఇసుక లారీలను తనిఖీలు నిర్వహించి, ఓవర్ లోడ్ పై వెంకటాపురం పోలీసులు చట్టపరమైన చర్యలకు తీసుకుంటూ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల పేర్లు, ప్రజాప్రతినిధులు పేర్లు చెప్పి ఇసుకను అక్రమ పద్దతిలో లారీల ద్వారా దోపిడీ చేస్తూ ఇసుక మాఫీయా కోట్లాది రూపాయలు దోపీడీ చేస్తున్నట్లు నూతన రాష్ట్ర ప్రభుత్వం కు పిర్యాదులు వెళ్ళినట్లు సమాచారం.
1 thought on “గోదావరి ఇసుక దొంగలను పట్టుకున్న పోలీసులు. ”