వెంకటాపురం చర్ల రహదారిపైకి చేరుకున్న గోదావరి వరద నీరు

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం చర్ల రహదారిపైకి చేరుకున్న గోదావరి వరద నీరు

– రాకపోకలపై ఆంక్షలు విధించిన వెంకటాపురం పోలీస్ శాఖ

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం – చర్ల రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 పై గోదావరి వరద నీరు రహదారిని ముంచెత్తడంతో వెంకటా పురం పోలీస్ అధికారులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు వీరభద్ర వరం సమీపంలోని కుక్క మాకు వంతెన, మరియు ఆలుబాక, భోదాపురం సమీపం లోని కొండాపురం వాగు వద్ద గోదావరి వరద నీరు ఆయా వాగులు గుండా వచ్చి రహదారి వంతెనలను ముంచాయి.  వరద నీటిమట్టం పెరుగుతుండడంతో, వాహనదారులు ముంపు కు గురైన వంతెనలు పై నుండి వాహనాలు నడపరా దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాల నివారణకు ప్రభు త్వ ఆదేశాల ప్రకారం రాకపోకలు నిలిపివేస్తున్నట్లు, వెంకటా పురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భద్రాచలం వైపు వెళ్లే వాహనదారులు, వెంకటాపురం నుండీ జగన్నాధపురం వై జంక్షన్ ఏటురునాగారం, మణుగూరు, అశ్వాపురం మీదుగా భద్రాచలం ఇతర ప్రాంతాలకు వెళ్ళవచ్చునని, వరదల సమయంలో ప్రజా భద్రతా పరమైన చర్యల్లో భాగంగా, వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్సై కోరారు. అలాగే ముంపు కు గురైన వీరభద్రవరం, ఆలు బాక భోదాపురం, కొండాపురం వాగు వద్ద స్టాఫ్ బోర్డుతో పాటు రాకపోకలు నిషేధించే విధంగా, రోడ్డుపై బారి కేట్లు ఏర్పాటు చేశారు. కాగ భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండ వాగులు పొంగి ప్రవహిస్తుండగా, మరోపక్క గోదావరి వరదలు ఈ ప్రాంతం గ్రామాల చుట్టూ కను చూపు మేరలో వరద నీరు ప్రవహిస్తూ పల్లపు ప్రాంత గ్రామాల ప్రజలను భయాంధోళనలకు గురిచేస్తున్నాయి.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now