గొడవలు వద్దు.. రాజీలు ముద్దు…
కన్నాయిగూడెం ఎస్ఐ ఇ. వెంకటేష్
కన్నాయిగూడెం, సెప్టెంబర్4, తెలంగాణజ్యోతి: వివాదాలను పెంచుకుంటే జీవితాంతం కొనసాగుతాయని రాజీ మార్గం రాజా మార్గమని కన్నాయిగూడెం ఎస్ఐ ఇ. వెంకటేష్ పిలుపు నిచ్చారు. వివాదాలు పెంచుకుంటే జీవితాంతం కొనసాగుతా యని, కలిసిపోవాలనే నిర్ణయానికి వస్తే వెంటనే సమసి పోతాయని ఆయన అన్నారు. ఉచిత న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో జెఎఫ్‌సిఎం కోర్టు, ములుగులో సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 13 వరకు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో యాక్సిడెంట్, కొట్టుకున్న, చీటింగ్, వివాహబంధం, చిన్నచిన్న దొంగతనం వంటి రాజీ చేయదగిన కేసులను కాంప్రమైజ్ చేసుకుని పూర్తిగా క్లోజ్ చేసుకోవచ్చని చెప్పారు. కాబట్టి కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇందుకోసం ఫిర్యాదు దారులు మరియు నిందితులు ఇద్దరూ తమ ఆధార్ కార్డు తీసుకుని కోర్టుకు హాజరుకావాలని ఎస్ఐ వెంకటేష్ సూచించారు.