గిరివాణి–ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆదేశాలు
ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: గిరివాణి, ప్రజావాణి కార్యక్రమా లకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ ఏటూరునాగారం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి–గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపిస్తూ అర్జీలు సమర్పించగా, కలెక్టర్ వాటిని శ్రద్ధగా విని వెంటనే పరిష్కారానికి అధికారులను దిశానిర్దేశం చేశారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరివాణికి 60, ప్రజావాణికి 32 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, డీడీ జనార్దన్, ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.









