- మట్టి తవ్వకాలపై ఘాట్ సమాధానం..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామ చివారిలో అక్రమంగా మట్టి తవ్వ కాలు జరుగుతున్నాయి..పట్టా ల్యాండ్ లో పర్మిషన్ కాకుండా వేరే భూమిలో మట్టి తవ్వకాలు జరుగుగున్నాయనే నేపథ్యంతో దీనిపై తహశీల్దార్ ను వివరణ కోరగా మట్టికి అనుమతి నేను ఇవ్వలేదని మీరు వెళ్లి పొండనీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. పర్మిషన్ కావాలంటే ఆర్ఐని అడిగి తెలుసుకోండి. తనే అనుమతి ఇచ్చారని నాకు ఏమి తెలియదని పలువురు విలేకరులతో చెప్పారు.