లక్ష్మీదేవిపేట గౌడ సంఘం అధ్యక్షుడిగా గట్టు శంకర్ గౌడ్ ఎన్నిక
వెంకటాపూర్, అక్టోబర్ 7, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లోని లక్ష్మీదేవిపేట గౌడ సంఘం అధ్యక్షుడిగా గట్టు శంకర్ గౌడ్ మూడోసారి ఎన్నికయ్యారు. మంగళవారం లక్ష్మీదేవిపేట గ్రామంలో నల్లగుంట, బూరుగుపేట, లక్ష్మీదేవిపేట గ్రామాలకు చెందిన గౌడ కులస్థుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో శంకర్ గౌడ్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మెరుగు మల్లయ్యను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా బుర్ర సదానందం, మామిండ్ల సంపత్, చిర్ర హరీష్, బుర్ర అశోక్, చిర్ర గణేష్, వీరగాని రమేష్, పెరుమండ్ల విక్రమ్, కొండ తిరుపతి, కారుపోతుల చిన్న రాజు, కొండ శంకర్, జనగాం రవీందర్, కాసగాని ఓదెలు తదితరులు ఎన్నికయ్యారు.