గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
– ఎస్సై కే. తిరుపతిరావు
వెంకటాపురం, ఆగస్టు 22, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గణపతి నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కే. తిరుపతిరావు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఉత్సవ కమిటీ బాధ్యులను కోరారు. గణేష్ ఉత్సవాల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధన ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై కే. తిరుపతిరావు పిలుపునిచ్చారు.