దోపిడీ దొంగల ముఠా అరెస్ట్ – సొత్తు స్వాధీనం. 

Written by telangana jyothi

Published on:

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్ – సొత్తు స్వాధీనం. 

– వెంకటాపురం సి.ఐ. కుమార్ వెల్లడి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో గత కొంత కాలంగా వరుస దొంగతనాలు కు పాల్పడుతున్న దొంగల ముఠాను వెంకటాపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున పట్టుబడ్డ దొంగల ముఠా వివరా లను వెంకటాపురం సి.ఐ. బండారి కుమార్ మీడియాకు వెల్లడించారు. సీ.ఐ కథనం మేరకు గురువారం రోజున వెంక టాపురం పరిధిలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో వాహనాలు తనకి నిర్వహిస్తుండగా నూగూరు వైపు నుండి వెంకటాపురం వైపు ముగ్గురు వ్యక్తులు హీరో హోండా ద్విచక్ర వాహనంపై వస్తు పోలీసులను చూసి పారి పోవడానికి ప్రయత్నించగా అనుమానంతో వారిని పోలీసులు పట్టుకొని తనిఖీలు చేశారు. వారి వద్ద బంగారం, వెండి ఆభరణాలు తో పాటు కొంత నగదు పట్టుబడిందని తెలిపా రు. వెంటనే వారిని విచారించగా పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు గత నెల రోజుల నుండి నూగూరు వెంకటాపురం మండల పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి, రాత్రి సమయంలో వరుస దొంగతనాలుకు పాల్పడుతు న్నారని వారు నేరం ఒప్పుకున్నారు. దొంగతనాలు చేసినప్పు డు దొరికిన ఆభరణాలలో కొన్ని తెలిపిన వ్యక్తికి అమ్మినా మని, మిగిలిన ఆభరణాలు వారి వద్ద ఉన్నాయని నేరం ఒప్పుకొన్నట్లు వెంకటాపురం సి.ఐ. తెలిపారు. కాగా పట్టుబడే సమయం కూడా వారు ఏదైనా తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి వెళుతున్నట్లుగా వారు ఒప్పుకున్నారని సి.ఐ. కుమార్ వెల్లడించారు. రామన్నగూడెం గ్రామానికి చెందిన జూపాక ప్రశాంత్ఏ .పి లోని అనకాపల్లి జిల్లా నర్సంపేట మండలం బల్లిగడ్డను గ్రామానికి చెందిన కల్తీ రాజు, ఎటు రు నాగారం లంబడి తండా కు చెందిన గార ప్రవీణ్ లుగా గుర్తించామని తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తుల వద్ద నుండి బంగారపు చెవి కమ్మలు ఒక జత, ఇంటి తాళం ను పగలు గొట్టడానికి ఉపయోగించే వస్తువు. సాంసంగ్ స్మార్ట్ ఫోన్, బంగారం , మూడు వెండి పట్టీలు, ఒక జత కీప్యాడ్ చరవాణి, రియల్మీ స్మార్ట్ ఫోన్, ఇంకా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతి రావు సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now