భూపాలపల్లి జిల్లాలో కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

భూపాలపల్లి జిల్లాలో కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

భూపాలపల్లి జిల్లాలో కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

– జల్సాలకు అలవాటు తో దొంగతనాల వైపు యువత

– నిందితులను పట్టుకున్న మహాదేవపూర్ పోలీసులు

కాటారం, అక్టోబర్ 17 (తెలంగాణ జ్యోతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న యువకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహాదేవపూర్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్ కుమార్ తో కలిసి కాటారం డిఎస్పి సూర్యనారాయణ వివరాలను వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గల కరెంట్ స్థంబాలకు ఉన్న కాపర్ కేబుల్ వైర్ దొంగతనం కేసులోని నేరస్థులు అంబటిపల్లి గ్రామానికి చెందిన వడ్ల వినోద్ కుమార్(28), నల్ల సతీష్(29) , గుజ్జుల మహేష్(35) లను రెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు డిఎస్పి తెలిపారు. జనవరి నెలలో మేడిగడ్డ బ్యారేజ్ కుడి పక్కన గల కరెంట్ స్థంబాలకు ఉన్న కాపర్ వైర్ ను ఎవరో గుర్తు తెలియని దొంగలు మొత్తం 300 మీటర్ల కాపర్ వైర్ దొంగతనం జరిగిందని మేడిగడ్డ బ్యారేజ్ జూనియర్ ఇంజనీర్, పిర్యాదు చేశారు. మహాదేవపూర్ కె పవన్ కుమార్ కేసు నమోదు చేసి, మహాదేవపూర్ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో పవన్ కుమార్ తన సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతూ పోలీస్ లను చూసి పారి పోతుండగా పట్టుకుని విచారించారు. వినోద్ కుమార్(28), నల్ల సతీష్ (29), గుజ్జుల మహేష్(35) అందరు స్నేహితులు. కూలి పనులు చేసుకుంట బ్రతుకుతారని, ముగ్గురం త్రాగుడు మరియు జల్సాలకు అలవాటు పడి, కూలి పనులకు వెల్లగా వచ్చిన డబ్బులు మా అవసరాలకు సరిపోక ఈ సంవత్సరం జనవరి నెలలో ముగ్గురం కలిసి దొంగతనాలు చేసి ఆ డబ్బుతో జల్సాలు చేసుకునేందుకు, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర స్తంబాలకు కాపర్ కేబుల్ వైరు తీగలు ఉన్నాయి, వాటికి మార్కెట్ లో చాలా రేటు ఉంటది కాబట్టి అట్టి వైర్లను దొంగిలించి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించారు. జనవరిలో రాత్రి సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కి కుడి వైపున గల స్తంబాలకు ఉన్న సుమారు 180 మీటర్ల కాపర్ కేబుల్ వైరును, మరియు ఆగష్టు నెలలో 120 మీటర్ల కాపర్ కేబుల్ వైర్ ను ముగ్గురు కలిసి దొంగిలించి, దానిని గుర్తు తెలియని వ్యక్తికి అమ్ముకొని వచ్చిన డబ్బులు అందరు పంచుకున్నారని మరలా శుక్రవారం కాపర్ వైర్ దొంగతనo కోసం వెళ్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
నేరస్థుల నుండి దొంగతనానికి ఉపయోగించే ఒక హ్యాక్సా బ్లేడ్ మరియు ఒక కటింగ్ ప్లేయర్, కాపర్ వైర్ 120 కేజీలు, మరియు 1,30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.. నేరస్తులను పట్టుకోవటంలో సాంకేతిక ఆధారాలు, సిసి కెమెరాలు, వెహికల్స్ చెకింగ్, టెక్నికల్ డాటా, ద్వారా పోలీసులు చేదించారు.ఈ కేసును అతి తక్కువ కాలంలో చేదించిన మహాదేవపూర్ పోలీసులను కాటారం డి ఎస్ పి సూర్య నారాయణ అభినందించినారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment