వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.కుమార్ కు గ్యాలంటరీ అవార్డు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందజేత.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ కు గ్యాలంటరి అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా హైదరాబాద్లో సీఐ కుమార్ సి. ఎం. చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన సీ.ఐ.కుమార్ ను పోలీస్ ఉన్న తాధికారులు గ్యాలంటరీ అవార్డుకు సిఫారసు చేయగా అవాార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వివిద రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు, ప్రజా ప్రతినిధులు, మీడియా మిత్రులు, ఇంకా పలువురు సి. ఐ. కి శుభాకాంక్షలు తెలిపారు.