ఏజెన్సీ మండలాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
వెంకటాపురం, సెప్టెంబర్ 29, తెలంగాణ జ్యోతి : భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని, భద్రాచలం–వెంకటాపురం ప్రధాన రహదారి మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నేతలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకాటి శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో పిఎసిఎస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిడెం మోహన్‌రావు నేతృత్వంలోని బృందం మంత్రి శ్రీహరిని కలిసి స్థానిక సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, “నిధుల లభ్యతను బట్టి ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు మండలాలకు నిధులు మంజూరు చేస్తాం. మారుమూల ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడానికి కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండమళ్ళ కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.