లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

నారాయణపేట, జూలై 31, తెలంగాణ జ్యోతి : లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్లమ్మకుంట జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ లయన్ మణికంఠ గౌడ్, కోచైర్మన్లు డాక్టర్ లయన్ రాజేష్ గౌడ్, డాక్టర్ లయన్ అశోక్ లు అవసరమైన మందులు పంపిణీ చేసి, ఆరోగ్య సంరక్షణపై సూచనలు అందించారు. శిబిరం విజయ వంతంగా నిర్వహించేందుకు సహకరించిన డాక్టర్ తిరుపతి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ లను శాలువాలతో సత్కరించారు. గురుకుల ప్రిన్సిపాల్ రేవతి లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జోన్ చైర్మన్ సూగురు జైపాల్ రెడ్డి, డాక్టర్ శ్రీరామ్, జాయింట్ సెక్రటరీ మామిళ్ల పృథ్వీరాజ్, సభ్యులు కర్ని స్వామి, గవినోళ్ల జైపాల్ రెడ్డి, ఆంబాదాస్, రఘు ప్రసన్న భట్, కట్టా వెంకటేష్, కొండా విజయ్, శరణప్ప, వాకిటి రమేష్, భార్గవ్ రాణా, హెల్త్ సూపర్వైజర్ నిహరిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment