దామరకుంటలో ఉచిత వైద్య శిబిరం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామంలో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు ఆదేశాల మేరకు శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో పటేల్ ఐ కేర్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కంటి వైద్య శిబిరాన్ని తాజా మాజీ సర్పంచ్ బాసాని రఘువీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనగంటి తిరుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 55 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందు లు, ఐ డ్రాప్స్ అందజేశారు. సుమారు 43 మంది రోగులకు ఆపరేషన్ నిమిత్తం రేకుర్తికి తరలించనున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, పేదలకు వైద్య సేవలు అందిస్తున్న పటేల్ ఐ కేర్ బృందాన్ని స్థానికుల అభినందించారు. ఈ కార్యక్రమంలో బాసాని రఘువీర్, ఎనగంటి తిరుపతి రెడ్డి, కోడిపెళ్లి రాము, జిల్లెల సాగర్, పొనగంటి రవితేజ, మోతి నారాయణ, కోడిపెల్లి సాగర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు