టిప్పర్ ఢీకొనీ నాలుగు పాడి గేదలు మృతి.
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : మండలం లోని చిన్నబోయినపల్లిలో టిప్పర్ అదుపుతప్పి గేదెలను ఢీకొనగా నాలుగు పాడి గేదలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లంపల్లి నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో రోడ్డు దాటుతున్న గేదలను అతివేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.