బి ఆర్ ఎస్ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కొండపర్తి రమేష్ అలియాస్ రవి కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. ఇటీవల రవి, తన తండ్రి సమ్మయ్య చారి తో కలిసి ఇరువురు మహాదేవపూర్ లో ఓ కార్యక్రమానికి హాజరై, తిరిగి కాటారం ఇంటికి బైక్ పై వస్తుండగా రోడ్డుపై ఉన్న గాడిలా వల్ల ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సమ్మయ్య చారి మృతి చెందారు. కాగా గురువారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కొండపర్తి సోదరులు రవి, శ్రవణ్ కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్, ఊర వెంకటేశ్వరరావు, మందల లక్ష్మారెడ్డి, జక్కు శ్రవణ్, వంగల రాజేంద్ర చారి, బాసాని రవి, తైనేని సతీష్, చీమల వంశీ, మేడిగడ్డ దుర్గారావు, అట్టెం పోచయ్య, ఎండి సిరాజ్, ఎండి మున్నా, గంట సమ్మయ్య, పోడేటి లింగయ్య, రాజు పటేల్, బొడ్డు సుధాకర్, రామిల్ల రాజు, మంతుర్తి రాజ్ కుమార్, అనుముల రమేష్, ఓలపు శ్రీనివాస్ ముదిరాజ్, బొడ్డు మధుకర్, చందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.