కలప తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు
ఏటూరునాగారం, అక్టోబర్ 19, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద అక్రమంగా టేకు దుంగలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారుల వాహనాన్ని గుర్తించిన వెంటనే స్మగ్లర్లు కలప తరలిస్తున్న వాహనాన్ని వదిలి పరారయ్యారు. ఫారెస్ట్ అధికారులు వాహనాన్ని సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న టేకు దుంగల విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.