శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం

On: April 6, 2026 4:16 PM

శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం

శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం

 41 రోజులపాటు సేవా కార్యక్రమం

ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ రహదారిలో ఉన్న శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దొంతి రెడ్డి కవిత–శ్రీనివాస్ రెడ్డి దంపతులు అన్నదాతలుగా నిలిచారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తమండలి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో 41 రోజులపాటు నిరంతర అన్నదానం నిర్వహిస్తున్నామని, ఆలయ అధ్యక్షుడు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి సహకారంతో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి సభ్యులు పేరబోయిన శ్రీధర్, బాణాల రాజకుమార్, ఆవుల ప్రశాంత్ రెడ్డి, అరిగెల రవీందర్, ఒజ్జల కుమార్, భక్తమండలి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!