నార్లాపూర్‌లో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదానం
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని నార్లాపూర్ లో గణపతి నవరాత్రుల పర్వదినం సందర్భంగా గురువారం శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దాతలుగా బచ్చు సుబ్బారావు, పాలడుగు చంద్రశేఖర్, బొమ్మగాని గణేష్, దేవరకొండ వెంకటేశ్వర్లు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో శ్రీరామ్ యూత్ అధ్యక్షుడు దేవరకొండ ప్రశాంత్, రాజశేఖర్, భువనేశ్వర్ కుమార్, అఖిల్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.