మీనాక్షి పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం
– లక్షల్లో ఆస్తి నష్టం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం లోని ధన్వాడ సమీపంలో గల మీనాక్షి పత్తి మిల్లులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు పత్తి మిల్లు నిర్వాహకులు తెలి పారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పత్తి మిల్లులో కొనుగోలు చేసి నిల్వ ఉంచిన పత్తికి అకాస్మాత్తుగా మంటలు అంటు కోవ డంతో మిల్లు యాజమాన్యం అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో జిల్లా కేంద్రంలో ఉన్న అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందిం చారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కాటారం సీ ఐ నాగార్జున రావు, ఎస్ఐ అభినవ్ లు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మిల్లు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.