టెన్త్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

టెన్త్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

– వెంకటాపురంలో 2 పరీక్ష కేంద్రాలు, 275 మంది విద్యార్థులు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  పదో తరగతి పరీక్షల నిర్వహణకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. అలాగే మంచినీటి వసతి, విద్యుత్తు ఇతర సౌకర్యాలను కల్పించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 135 మంది విద్యార్థులు, చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలలో 140 మంది విద్యార్థులకు పరీక్షలు రాయను న్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. వెంకటాపురం జడ్పీఎస్ఎస్ పాఠశాలకు చీఫ్ సూపర్డెంట్ గా ఎస్వీ ఆనందరావు, చిరుతపల్లి పరీక్షా కేంద్రానికి ఛీప్ సూపర్డెంట్ గా ఎం. సోమ్లా లతో పాటు ఇతర అధికారులను నియమించారు. మండల తహసిల్దార్ పి. లక్ష్మీ రాజయ్య వెంకటాపురం మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ మేరకు పోలీస్ శాఖ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతాపరమైన నిషేధాజ్ఞలు అమలు చేస్తూ ఉన్నతాదికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment