రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలి : ఏఈఓ కళ్యాణి
కన్నాయిగూడెం,తెలంగాణ జ్యోతి : అర్హులైన రైతులు రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని కన్నాయిగూడెం ఏఈవో కళ్యాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ 2024 జూన్ 28 వరకు నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు,18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు వయసు గల రైతులు బీమా కు అర్హులని తెలిపారు. వారందరూ రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు బీమా ఫారం నింపి దానితో పాటుగా నూతనంగా వచ్చిన పట్టా పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డ్ జిరాక్స్, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్ పత్రాలను జత చేసి రైతులు స్వయంగా వెళ్లి, వ్యవసాయ విస్తీరణ అధికారికి ఆగస్టు 5వ తేదీలోగా అందచేయలన్నారు. మార్పు చేర్పులు కోసం ఇంతకు ముందు నమోదు చేసుకున్న రైతులు ఎవరైనా సవరణలు ఉంటే ఈ నెల 30 లోపు సరి చేసుకోవాలని, ప్రమాద శాత్తూ నామిని చనిపోయిన, కొత్త నామిని మార్పు కోసం వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు మరణిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు నామినికి ఇస్తుందని, రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.