నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నట్టేట మునిగిన రైతులు

Written by telangana jyothi

Published on:

నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నట్టేట మునిగిన రైతులు

– హైటెక్ మొక్కజొన్న కంపెనీ పై చర్యలు తీసుకోవాలి. 

– ఎకరానికి లక్ష 50 వేలు పంటనష్ట పరిహారం చెల్లించాలి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ గ్రామాలకు చెందిన ఆదివాసీ రైతులు హైటెక్ కంపెనీ మొక్క జొన్న విత్తనాలను నాటి నట్టేట మునిగామని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు శనివారం వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులు రామవరం, బర్లగూడెం, చిరుతపల్లి, యోగితానగర్, మురుమూ రు, పర్శికగూడెం ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఆదివాసి రైతులు, ఆదివాసీ నవనిర్మాణ సేన ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్సా నరసింహమూర్తి అధ్యక్షతన నకిలీ విత్తనా లతో నష్టపోయిన రైతులు సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో వెంకటాపురం పట్టణానికి చెందిన హైటెక్ కంపెనీ ఆర్గనైజర్ బహుళ జాతి మొక్కజొన్న సంస్థ ఆర్గనైజర్ ఎకరానికి నాలుగు టన్నులకు పైగా దిగుబడి వస్తుందని నమ్మ పలికి హైటెక్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చారని, అయితే మొక్కజొన్న జాగ్రత్తగా సాగు చేసి కంపెనీ సూచనల ప్రకారం పంటలో పనులు చేశామన్నారు. అయితే మొక్కజొన్న కండెకు పది నుంచి 20 గింజలు మాత్రమే బోడ కండెలు వచ్చాయని, దీంతో తాము నకిలి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. భూమి కౌవులుతో పాటు కలిపి ఎకరానికి లక్ష 50 వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని పంట నష్టపోయిన రైతుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. నకిలీ విత్తనాలతో ఆదివాసి రైతులను మోసం చేసిన హైటెక్ మొక్కజొన్న కంపెనీ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనిడిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్సా నరసింహమూర్తి మాట్లాడుతూ బహుళ జాతి మొక్కజొన్న కంపెనీలు రైతులను కూలీలుగా మారుస్తు న్నారని, నకిలీ విత్తనాలు ఇచ్చి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి రైతులు వద్ద ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్లు సేకరించి వాళ్లే పరిహారం తీసుకుంటున్నారని ఆరోపించారు. హైటెక్ మొక్క జొన్క కంపెనీ ఎకరానికి లక్ష 50 వేలు నష్టపరిహారం ఇచ్చేవరకు దశల వారీ ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్,ఐటిడిఎ పిఒ ములుగు జిల్లా వ్యవసాయ అధికారి, పోలీస్ స్టేషన్, తదితర అధికారులకు ఫిర్యాదు చేయాలని సమావేశం తీర్మానించింది. ఇటీవల 8 ఎకరాలకు పైగా హైటెక్ విత్తనాలు విత్తనాలు సాగుచేసిన ఆదివాసి రైతు బోడి కంకులు, గింజలు లేని కంకులను చూసి చిరుతపల్లికి చెందిన కచ్చలపు అనే గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పరిహారం చెల్లించకుంటే అప్పులు చేసి సాగు చేసిన రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని, రైతులంతా ఐక్యంగా ఉండి నష్టపరిహారం సాధించుకునేందుకు సంఘటితం కావాలని కోరారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now