అంకిత సేవలకు వీడ్కోలు

అంకిత సేవలకు వీడ్కోలు

అంకిత సేవలకు వీడ్కోలు

– పదవి విరమణ చేసిన షేక్ రసూల్ బీ

ఏటూరునాగారం, జూలై 5, తెలంగాణ జ్యోతి :  మండలం లోని షాపెల్లి గ్రామంలో 47 సంవత్సరాలపాటు ప్రజలతో మమేకమై, నిస్వార్థంగా సేవలందించిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ షేక్ రసూల్ బీ ఈ రోజు పదవీవిరమణ పొందారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం సబ్ పోస్ట్ ఆఫీసులో ఆమెకు ఘన సత్కారం నిర్వహించారు. జిల్లా ఇన్స్పెక్టర్ దయానంద్ అధ్యక్షతన, పోస్ట్ మాస్టర్ రాయల గోపి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రసూల్ బీ ప్రజలపట్ల ప్రేమతో అంకిత భావంతో పనిచేయడమే నాకు గర్వకారణమని భావోద్వేగంతో స్పందించారు. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్సిల్ గౌసియా బేగం, పోస్ట్ మాన్ ముకేశ్, నరేష్, పాపా రావు, వహీద్, సత్యనారాయణ, హైమద్, సాయి, విష్ణు, రాజు, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment