విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మడిదొడ్డి క్రాస్ జాతీయ రహదారి పై శనివారం సాయంత్రం పేరూరు పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ లను చేపట్టారు. నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో, పేరూరు ఎస్సై జి .రమేష్ వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల్లో ప్రయాణిస్తున్న అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అక్రమ నగదు ఇతర ధ్రువీకరణ పత్రాలు లేని వాటిని వాహనాల్లో తరలించరాదని కోరారు. ఈ సందర్భంగా ప్రతి వాహనదారుడువాహనాల పత్రాలు కలిగి ఉండాలని, ఇతర రోడ్ ప్రయాణ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. వాహనాల తనిఖీల కార్యక్రమంలో పేరూరు సివిల్ పోలీస్, మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.