జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, శుక్రవారం జాతీయ రహదారిపై పేరూరు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. పేరూరు పీఎస్ పరిధిలోని ధర్మారం అవుట్ కట్స్ వద్ద పేరూరు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి .రమేష్ ఆధ్వర్యంలో, వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వ హించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ సందర్భం గా రోడ్డు ప్రయాణ భద్రతా పరమయిన అంశాలపై ఇంధన శకట వాహనదారులుకు అ వగాహన కల్పించారు. ప్రతి ఒక్క ఇంధన శకట వాహన దారుడు సంబంధిత ఇంధన శకటానికి సంబంధిం చిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్ మరియు శిరస్సు రక్షణ కవచం లేని ద్విచక్ర వాహన ప్రయాణం ప్రమాదకరమని, వాహనదారులకు ప్రయాణికులకు పేరూరు ఎస్సై రమేష్ రోడ్డు ప్రయాణ భద్రతాపర మైన అంశాలపై అవగాహన కల్పించారు.ఈ తణిఖీ ల కార్యక్రమం లో సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
1 thought on “జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీలు ”