కాంగ్రెస్ పార్టీ పటిష్టత కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, జూలై 27, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భవిష్యత్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య కార్యవర్గ తిరుమల, కమిటీ సభ్యులు ఆదివారం రాత్రి మంత్రిని కలిసి ఒక్కొకరుగా సన్మానం చేశారు. రాబోయే కాలంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులకు తెలిపారు. పదవులు ఆశించిన నాయకుల వద్దకు ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడాలని పదవులు వచ్చిన సమయంలో అందరూ హుందాగా కలుపుకొని పనిచేయాలని కాంగ్రెస్ శ్రీధర్ బాబు దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్ష పార్టీలో నాయకులు విమర్శించినప్పుడు అదే స్థాయిలో నాయకులు, కార్యకర్తలు మాట్లాడాలని ఆదేశించారు. కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల సమ్మయ్య వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డైరెక్టర్ లు రామగుండం శ్రీనివాస్, పిల్లమారి రమేష్, మహేష్ తిరుపతిరావు, ఇర్షాద్, ములకల శ్రీనివాస్ రెడ్డి, గోమాస సడువలి, పోత రామకృష్ణ, దాసరి సంతోష్, జాటోత్ రాజారాం నాయక్, పాగె రాజయ్య, ముక్క శ్రీనివాస్, నడిపెల్లి భారతి లు శ్రీధర్ బాబును ఒక్కొక్కరుగా శాలువాతో సత్కరించారు.
గ్రంథాలయ చైర్మన్ రాజబాబు కు సన్మానం
భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబును మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. పాలపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న పాటారం మండల కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి లు రాజబాబును శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అయిత రాజిరెడ్డి, మంథని, కమాన్పూర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.