పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలి.
– మొక్కలు నాటడం, పెంచడం జీవిత చర్యల్లో భాగం చేయాలి.
– ఇంచర్ల ఏకో పార్క్ లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు ప్రతినిధి, జూన్ 5, తెలంగాణ జ్యోతి : భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవి శాఖ ఆధ్వర్యంలో ములుగు మండల కేంద్రంలోని ఇంచర్ల ఏకో పార్క్ లో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ తో కలసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని అన్నారు. చెట్టు నీడతోపాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను అందిస్తుందని, చెట్టు నీడ వెలకట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లని ప్రతి ఒక్కరూ చెట్టును నాటి సమాజంలో మార్పు తీసుకు రావాలని శుభ కార్యక్రమాల్లో కేకులను కట్ చేసి హంగామా సృష్టించే బదులు మొక్కలు నాడాలని అన్నారు. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ శంకర్, డిప్యూటీ ఎఫ్ ఆర్ ఓ శోభన్, ఎఫ్ ఎస్ ఓ రవీందర్, మమత, ఎఫ్ బి ఓ లు శ్యామ్ సుందర్, శ్యామ్ ప్రసాద్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.