కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అందరూ హాజరు కావాలి
వెంకటాపురం, అక్టోబర్ 3, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో రేపు (శనివారం)10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి మండల నాయకులు, కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు పార్టీ వ్యూహరచన, ఆశావహుల అభిప్రాయ సేకరణ, దిశానిర్దేశం వంటి అంశాలు ప్రధాన చర్చగా ఉండను న్నాయన్నారు. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త తప్పని సరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని సయ్యద్ హుస్సేన్ పిలుపునిచ్చారు.