కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడుగా పని చేయాలి.
– మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషిచేసి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, ప్రజాప్రతినిధులు, నాయకులు సైనికులుగా పనిచేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పిలుపునిచ్చారు.శనివారం వెంకటాపురం మండల కేంద్రంలోని కొపరేటివ్ సొసైటి కార్యాలయం పంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జరగనున్న లోక్ సభ ఎన్నికలు తో పాటు, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయపథం వైపు దూసుకుపోయే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీరయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజక వర్గంలో తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడి పోవటం బాధకరం అన్నారు. రానున్న పార్లమెంట్ ‘ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు కష్ట పడి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటి ‘చైర్మన్ చిడెం మోహన్రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సెన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్లులు చిడెం శివ , ఎంపీటీసీలు గార్లపాటి రవి, కొండపర్తి సీతాదేవి, నాయకులు బాలసాని వేణు, అట్టాం సత్యవతి, తదితరులు ఉన్నారు.