గోదావరి ఇసుక సొసైటీల ఆదాయంలో ప్రతి గిరిజన కుటుంబానికి లబ్ది.

Written by telangana jyothi

Published on:

గోదావరి ఇసుక సొసైటీల ఆదాయంలో ప్రతి గిరిజన కుటుంబానికి లబ్ది.

– ఆయా గ్రామాల ఇసుక సొసైటీలలో సభ్యులుగా లేని వారికి కూడ ప్రభుత్వపరమై ఇసుక ఆదాయ ఆర్దిక వాటా. 

– గ్రామాల్లో గిరిజనులు ఐక్యంగా ఉండి ప్రభుత్వ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలి. 

– భద్రాచలం ఐటిడిఎ పి.ఓ. ప్రతీన్ జైన్. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : గోదావరి ఇసుక సొసైటీలలో ఆయా క్లస్టర్ గ్రామాలు లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు కూడా సొసైటీలో సభ్యత్వం లేకపోయినా ఇసుక వ్యాపారం ద్వారా వచ్చే ప్రబుత్వ ఆదాయంలో వారికి కూడా హక్కులు ఉంటాయని, ప్రతి గిరిజన కుటుంబానికి ఇసుక సొసైటీ ద్వారా వచ్చే నగదులో సమానంగా పంపకం చేయటం జరుగుతుం దని,భద్రాచలం సమీకృత గిరిజనాబి వ్రుద్ది సంస్థ భద్రాచలం ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. గురువారం ములుగు జిల్లా వెంకటా పురం మండలంలోని రామచంద్రపురం, వీరభద్రవరం పంచాయతీ లలో మంజూరైన గోదావరి ఇసుక క్వారీ సొసైటీలకు కేటాయింపు కొరకు పీసా గ్రామ సభలకు భద్రాచలం ఐటిడిఏ పిఓ ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఆయా సభలలో సొసైటీల మహిళలను ఉద్దేశిం చి పి.ఓ మాట్లాడారు.పీసా గ్రామ సభలకు ములుగు జిల్లా పోలీస్ ఎస్పీ గౌస్ ఆలం, ఎటు రు నాగారం ఏ. ఎస్. పి సిరి శెట్టి సంకీర్తి టిఎస్ఎండిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీరభద్రవరం గ్రామంలో నిర్వహించిన ఇసుక సొసైటీ గ్రామసభలలో గ్రామస్తుల మధ్య తీవ్ర విభేదాలు తారస్థాయిలో ఉండటంతో, గ్రామసభను ఐటీడీఏ పీవో వాయిదా వేశారు. వీరభద్రవరం పంచాయతీలో గిరిజన మహిళ ఇసుక సొసైటీలు రిజిస్ట్రేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంజూరైన ఇసుక క్వారీలు తమకంటే, తమ సొస్సటీ లకు కేటాయించాలని, గ్రామ సభలో పోటీలు పడ్డారు.ఈ సంద ర్భంగా ఇరువైపులా నచ్చజెప్పి న వినక పోవటంతో గ్రామసభను ఐటిడిఏ పి ఓ వాయిదా వేశారు. గ్రామ గిరిజన కుటుంబాలన్నీ సొసైటీలలో సభ్యత్వం లేకపోయినా గోదావరి ఇసుక సొసైటీల ద్వారా వచ్చే ఆదాయంలో వారికి కూడా వాటా ఉంటుందని, అలాగే ఆయా కుటుంబాల్లో వివాహాలు జరిగి వేరే ఉంటున్న గిరిజన కుటుంబాలు కు కూడా వాటా ఉంటుందని ఐటీడీఏ పీవో తెలిపారు. మీరంతా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పరమైన మంజూరైన ఇసుక సొసైటీలను, ఇసుక వ్యాపారం ద్వారా ప్రభు త్వం కల్పించే ఆర్థిక సౌకర్యాన్ని సమానంగా అందరూ పంచుకోవా లని, తద్వారా ఆర్థికంగా అభివృద్ధి లబ్ధి సాధించాలని, గ్రామ పీసా గ్రామ సభలో మహిళలను కోరారు. ఈ సందర్భంగా వీరభద్రవరం పీసా గ్రామ సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో గ్రామసభను పి.ఓ. వాయిదా వేశారు. అనంతరం రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని అంకన్నగూడెం గ్రామం ఏర్పాటు చేసిన పిసా గ్రామ సభల్లో పూజారిగుడం, ఇప్పగూడెం, అంకన్నగూడెం గ్రామాల మధ్య నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలలో కూడా సొస్సటీలలో ఐక మత్యం లేకపోవడంతో అక్కడ కూడా గ్రామ పీసా గ్రామ సభను పి.ఓ వాయిదా వేశారు. రెండు వారాల్లో గ్రామసభ ఏర్పాటు చేసు కొని అందరు ఐకమత్యంగా ఉండి ,తిరిగి పిసా గ్రామసభ ఏర్పాటు చేసేందుకు, ప్రత్యేకంగా అదికారులు తో కమిటి ఏర్పాటు చేస్తున్న ట్లు గ్రామ సభలో ప్రకటించారు. అనంతరం రామచంద్రపురం లో జరిగిన గోదావరి సొసైటీ పీసా గ్రామ సభలో పాల్గొన్నారు. పిసా గ్రామ సభలో గ్రామ ఆదివాసీలు మహిళలు అంతా సమిష్టిగా సొసైటీ ఏర్పాటు చేసుకున్నమని, ఐకమత్యంగా గోదావరి సొసైటీ నడిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో, రామ చంద్రాపురం ఇసుక సొసైటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు పి.ఓ.ఐటిడిఏ ప్రకటించారు. గ్రామసభల్లో టిఎస్ఎండిసి అధికారు లతో పాటు, వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు, తాసిల్దార్ సమ్మయ్య, పిసా కమిటీ కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, గ్రామ సర్పంచులు సమ్మక్క,అట్టం సత్యనారాయణ తది తరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల పీసా కమిటీ కోఆర్డి నేటర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతి క్ జెన్, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఎటు రునాగారం ఏ ఎస్పి సిరి శెట్టి సంకీర్త తదితర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యటన సందర్భం గా పోలీసులు, గ్రామ సభల వద్ద ప్రతిష్టమైన బందోబస్తు నిర్వహిం చారు. వెంకటాపురం ఎస్.ఐ ఆర్. అశోక్,వాజేడు ఎస్ఐ వెంకటే శ్వరరావు సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది బందోబస్తు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tj news

1 thought on “గోదావరి ఇసుక సొసైటీల ఆదాయంలో ప్రతి గిరిజన కుటుంబానికి లబ్ది.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now