ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఎంచుకొని సాధన దిశగా కృషి చేయాలి

ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఎంచుకొని సాధన దిశగా కృషి చేయాలి

-వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధనదిశగా కృషి చేస్తూ జీవితంలో ఉన్నంత శిఖరాలను అధిగామించి సమాజం అభివృద్ధికి తోడ్పాడలని వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ వెంకటాపూర్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు వీరేష్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నూరు సూర్యనారాయణ హాజర య్యారు. ఈ సందర్భంగా జెడ్ పి ఎస్ ఎస్ లక్ష్మీదేవి పేట పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ 10 వ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఉన్నంత చదువు, కెరీర్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థి దశలో పదవ తరగతి కీలకమని, జీవితంలో ఎదగా లంటే కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, ఫ్లెక్సీ బుల్టి ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఏర్పార్చుకొని లక్ష్య సాధనదిశగా కృషి చేస్తూ జీవితంలో ఉన్నంత శిఖరాలను అధిగామించి సమాజం అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువా లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండ్ల రాజయ్య పిఎస్ఎస్ డైరెక్టర్ నక్క సదయ్య బలంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు జనగాం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment