లయన్స్ క్లబ్ ములుగు ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
– గెలుపొందిన వారికి మెమొంటోల బహుకరణ
ములుగు,సెప్టెంబర్ 02,తెలంగాణజ్యోతి : ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ములుగు బాలుర హైస్కూల్, జడ్పీ బాలుర హైస్కూల్, జడ్పీ బాలికల హై స్కూల్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఒక్కొక్క పాఠశాల నుండి గెలుపొందిన ముగ్గురు విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ మొమెంటోలతో పాటు ప్రశంసాపత్రాలను జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్ప అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంటే మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మన ఇండ్లలో చెట్లను నాటు కోవాలని,ప్లాస్టిక్ ను వాడకూడదని అన్నారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అవగాహన కోసం ములుగు లయన్స్ క్లబ్ వారు మంచి కార్యక్రమం చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ములుగు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి లయన్ చుంచు రమేష్,లయన్ దొంతిరెడ్డి బలరాం రెడ్డి,లయన్ సానికొమ్మ రవీందర్ రెడ్డి, లయన్ కొండి రవీందర్, లయన్ జగన్, లయన్ ఉదయ్ తో పాటు పాఠశాలల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తదితరులు పాల్గొన్నారు.