వెంకటాపురంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం

వెంకటాపురంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం

వెంకటాపురంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం

– జి.ఎస్.పి. రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర

– రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డుకోవాలి

– సమగ్ర విచారణ జరపాలి డిమాండ్

వెంకటాపురం, ఆగస్టు 22, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం సహా పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గోడ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్&బి విశ్రాంతి భవనంలో జి.ఎస్.పి. జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2017లో ములుగు సబ్ కలెక్టర్‌గా ఉన్న పి.వి. గౌతమ్ ఐఏఎస్ ఆదేశాలతో వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములపై సర్వే చేసి సరిహద్దుల్లో దిమ్మలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ దిమ్మలను కూల్చివేసి గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమని విమర్శించారు. ప్రభుత్వ భూములను కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించిన పూనెం సాయి, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల ధర కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర వ్యాపారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీ భావితరాల భవిష్యత్తు కోసం షెడ్యూల్డు చట్టాలను గౌరవించి, ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అవసరం ఉందని పూనెం సాయి దొర పిలుపునిచ్చారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించి ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.ఎస్.పి మండల గౌరవ సలహాదారు పూనెం ముణేశ్వరావు,  సంఘం నాయకుడు సూర్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment