ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి
– వెంకటాపూర్ ఎంపీడీవో మూడు రాజు
వెంకటాపూర్, అక్టోబర్ 6, తెలంగాణ జ్యోతి : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డులు ఉన్న వేతన కార్మికులు తప్పని సరిగా కేవైసీ అప్డేషన్ చేయించుకోవాలని వెంకటాపూర్ మండల అభివృద్ధి అధికారి మూడు రాజు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతూ, కేవైసీ చేయించుకోని కూలీలు ఇకపై ఉపాధి హామీ కింద పనులకు హాజరు కావడం లేదా పనులు పొందడం సాధ్యంకాదని ఆయన తెలిపారు. అలాగే, అట్టి కూలీలకు వ్యక్తిగత పనులు శాంక్షన్ చేయడం కూడా జరగదని చెప్పారు. ప్రతి జాబ్ కార్డు దారుడు తమ గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ను సంప్రదించి వెంటనే కేవైసీ అప్డేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో కోరారు. చనిపోయినవారి పేర్లు, పెళ్లయి అత్తగా రింటికి వెళ్లిన మహిళల వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలియ జేసి జాబ్ కార్డుల నుండి తొలగించుకోవాలని సూచించారు.