ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక

ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక

ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక

కాటారం, జూన్ 23, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలంలోని 18 గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు చేసిన రూ 4,65,62,098 వెచ్చించారు. వేతన రూపంలో 3,32,24,593 లు, మెటీరియల్ రూపంలో 1,33,37, 505 లను చెల్లించారు. డబ్బులు చెల్లించిన డాక్యుమెంట్లు పూర్తిగా ఆడిట్ బృందానికి ఇచ్చారు. గ్రామాలలో తనికి బృందం వారం రోజులపాటు పర్యటించి డాక్యుమెంట్లలో, ఏం. బి లలో నమోదుచేసిన కొలతలను సరి చూసి, పని జరిగిన ప్రదేశంలో తనిఖీ బృందం సందర్శించి తనిఖీలో గుర్తించిన అవక తవకలకు, మండల కేంద్రంలో ప్రజా వేదికలో వెల్లడించారు. ప్రిసీడింగ్ అధికారి పెనాలిటీ , రికవరీ రూ. 30,219 విధించారు. బాధ్యులయిన సిబ్బందికి 15 రోజులలోగా నోటీసులు జారీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటారని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ప్రిసీడింగ్ అధికారిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ, జిల్లా విజిలెన్స్ ఇంచార్జి అధికారి రూబీ నా బేగం, క్వాలిటీ కంట్రోల్ విభాగం ధరం సింగ్, అంబుడ్స్మెన్ శ్రీనివాస్ గ, అదనపు కార్యక్రమాదికారి రమేష్, ఏపిఓ సునీత, సోషల్ ఆడిట్ స్టేట్ టీం మేనేజర్ అజయ్, స్టేట్ రిసోర్స్ పర్సన్ గంగరాజు, వివిధ గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment