ఉనుక లారీ ఢీకొని విద్యుత్ వైర్లు, డిష్ వైర్లు ధ్వంసం
– ఆందోళన చేస్తున్న అప్పాల వారి వీధి ప్రజలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రమైన బీసీ మర్రిగూడెం పంచాయ తీలోని ఒక రైస్ మిల్ నుండి ఉనుక లోడ్ చేసుకొని అప్పాల వారి వీధి గుండా లారీ వెళ్తున్న క్రమంలో లారీ పై భాగం తగిలి విద్యుత్ వైర్లు, డిష్ వైర్లు తెగి కింద పడ్డాయి. దీంతో అనేక గృహాల్లో విద్యుత్ సరఫరా నిలిచి, టెలివిజన్ కనెక్షన్ లు ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పాల వారి వీధి ప్రజలు వరి పొట్టు లారీలను నిలిపివేసి రాస్తారోకో ఆందోళన నిర్వహించారు. డిష్ వైర్లు, విద్యుత్ వైర్లు వెంటనే మరమ్మతులు నిర్వహిం చాలన్నారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో చోటు చేసుకుంది. లారీని నిలిపివేసి సంబంధిత అధికారులకు అప్పాల వారి వీధి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.