Elections :  గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం 

Electionsగడపగడపకు కాంగ్రెస్ ప్రచారం 

  •  ఆరు గ్యారెంటీలతో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తో ప్రచారం. 
  • భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కి గ్రామాల్లో ప్రజల ఆదరణ. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉదయం నుండి పొద్దుపోయే వరకు గడపగడపకు కాంగ్రెస్ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు గిరిజనులు స్వాగత సన్నాహాలతో ఎదురేగి మద్దతు తెలిపారు. మండలంలోని ఏకన్నగూడెం, ఎదిర గ్రామాల నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి పి. వీరయ్య పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వీధి వీధిన గ్రామసభలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారంటీ స్కీములు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనేక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను గ్రామస్తులకు వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలను వంచిందని వాగ్దానాలను మరిచి, మాయ మాటలతో తిరిగి ప్రజల్లోకి వస్తుందని, మాయల మరాఠీలను నమ్మి ఓట్లు వేయొద్దని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018లో ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు పార్టీ అభిమానులతో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తో కొట్లాడిన ఎమ్మెల్యే వీరయ్య ను, టిఆర్ఎస్ పార్టీలోకి లాక్కునేందుకు కోట్ల రూపాయల ఎర చూపిన నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం అంటూ తిప్పి కొట్టి, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, తిరిగి ప్రజాసేవ కోసం కాంగ్రెస్ టికెట్ పొంది, ప్రజల మధ్యకు వచ్చిన మన ప్రియతమ నాయకుడు వీరయ్యను గెలిపించుకొని కోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు అభినందించి హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పలువురు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల సభల్లో, సమావేశాల్లో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి. వీరయ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. మండలంలోని సుమారు 13 గ్రామపంచాయతీలను ఎన్నికల ప్రచారాల్లో కవర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో శుక్రవారం దూసుకుపోయింది. వందలాది మంది వివిధ పార్టీలకు చెందిన మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెందిన అనేకమంది కాంగ్రెస్ పార్టీ కండువాలను స్వీకరించారు. ఆరు గ్యారెంటీ స్కీములు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పై విస్తృంగా ఆదివాసీ గ్రామాల్లో ప్రచారం చేయడంతో, గులాబీ కండువాలను సైతం వీడి, సమావేశాల్లో తామంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని పార్టీ లో చేరతామని అనేకమంది సమావేశాల్లో ప్రకటించడంతో, కాంగ్రెస్ వర్గాల్లో నూతన ఉత్సాహం నెలకొన్నది. వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఏదిర, విజయపురి, కాలనీ, సురవీడు, రామచంద్రపురం, మెర్రవానిగూడెం, వీరభద్రవరం, ఇంకా అనేక గ్రామాలతో పాటు అటవీ గ్రామమైన మంగవాఇ ను సైతం శుక్రవారం పొద్దుపోయే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బృందం ఎమ్మెల్యే పీ. వీరయ్య గ్రామాల్లో గిరిజనులతో సమావేశం నిర్వహించారు. టిఆర్ఎస్ కంచు కోటలు అయినా అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది.ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సమావేశంలో హర్షద్వానాల మధ్య ప్రకటించడంతో వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి స్వాగతించారు. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఇవ్వటంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార సందడి నెలకొన్నది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, జిల్లా నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, జడ్పిటిసి పాయం రమణ ,కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాసరావు,చిడెంశివ‌ , రమేష్, సమ్మయ్య ఎంపిటీసీలు సీతాదేవి ,రవి ,పార్టీ సర్ఫంచులు , వందలాది మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో వెంకటాపురం, పేరూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు రేఖా అశోక్, జి. రమేష్ లు ఆధ్వర్యంలో బందోబస్తు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Elections :  గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం 

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Elections :  గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం ”

Leave a comment