Elections | గెలుపా.. ఓటమా..!
– 3 దాకా వేచి చూడాల్సిందే..?
– అంతర్మథనంలో అభ్యర్థులు,కూడికలు తీసివేతల్లో శ్రేణులు.
తాడ్వాయి, డిసెంబర్1, తెలంగాణ జ్యోతి : ఏ నిజయోజక వర్గంలో ఎవరు గెలుస్తారు.? విజయ అవకాశాలు ఉన్నాయా..? ఏ వర్గం ఓట్లు ఎవరికి అనుకూలం..? ఇదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న చర్చ పోలింగ్ ముగిసిన తరువాత ఆ పార్టీల అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు అంచనాల్లో మునిగి తేలుతు న్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారిగా పోలైన ఓటింగ్ శాతం ఆధారంగా లెక్కిస్తున్నారు.. ఓవైపు పైకి గెలుస్తామని దీమని వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం ఈ నెల 3న వెలువడే ఫలితాలపైనే ఆశలు పెట్టుకున్నారు.ఆయా నియోజక వర్గంలో హోరాహోరీగా ప్రచారం మొదలుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్ల తీరును బట్టి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయని అంచనాలతో ఓట్లు లెక్కిస్తున్నారు.కూడికలు తీసివేతలతో గెలుపు అంతర్మథనాన్ని నిర్ణయిస్తున్నారు. మరోవైపు టీవీలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొంతమందిలో ఆశలు నింపగ మరికొందరు అభ్యర్థులును నిరాశలో పడేశాయి.
- ఎవరి లెక్కలు వారివే !!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గల పరిధిలో ఎవరికి వారీగా ప్రధాన పార్టీ నాయకులు తమకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేస్తున్నారు.గత ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకొని ఈసారి ఏ గ్రామాలు, డివిజన్లో ఎవరికి ఎన్ని ఓట్లు పెరిగాయా..? తగ్గాయా..? అనే విశ్లేషణలు చేసుకుంటున్నారు.ఊరు వాడల్లో ఎక్కడ ఇద్దరు గుమిడి కూడిన ఏ నాయకుడిని పలకరించిన ఎవరు గెలుస్తారని చర్చ విపరీతంగా జరుగుతుంది. ఫోన్లలో సన్నిహితులు ఇతర కార్యకర్తలను పలకరిస్తూ గెలుపు ఓటములు గురించే అందరూ ఆరా తీయడం వినిపిస్తుంది.ఏవర్గం వారు తమకు అనుకూలంగా వ్యవహరించరనే విషయాలపై అనుషరులతో ముఖ్య నాయకు లతో చర్చిస్తున్నారు. ఫలితాల తీరుపై అంచనాలను రూపొందిస్తు న్నారు.చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండ టంతో ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీస్తున్నారు.చర్చ ఉమ్మడి జిల్లాలో ఊపందుకుంది. ముఖ్యంకంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయం తమదంటే తమదేనని ద్వితీయ శ్రేణి నాయకులకు భరోసా కల్పిస్తున్నారు.కార్యకర్తల్లో ధైర్యం నింపే విధంగా ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారు.ఈనెల3తేదీ ఆదివారం ఫలితాల దాకా వేచి చూద్దామని చెప్తూనే శ్రేణుల్లో ఆశవహ దృక్పథాన్ని పెంచుతున్నారు.
తెలంగాణ జ్యోతి,చింతల సంపత్ యాదవ్, తాడ్వాయి.