ములుగు శ్రీరామాలయం నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షునిగా దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి ఏకగ్రీవం
ములుగు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ములుగు శ్రీరామాలయం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా దొంతిరెడ్డి రాకేష్ రెడ్డిని ఎంపిక చేయగా, ఉపాధ్యక్షులుగా ఏరువ కవిత, రుద్రోజు ఆనందచారి, గున్నాల తిరుమల్ రెడ్డి, సానికొమ్ము వంశీధర్ రెడ్డి, సానికొమ్ము శ్రీనాథ్ రెడ్డి, నగరపు రమేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా బాణాల రాజ్‌కుమార్, ఆవుల ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, కోశాధికారిగా చింతలపూడి చిన్నకొండారెడ్డి బాధ్యతలు చేపట్టారు. కార్యదర్శులుగా మేచినేని రాజేష్, వాంకుడోత్ జ్యోతి, సైకం స్వరూప, కొమురవెల్లి సతీష్, అల్లూరి సంధ్య, ఒజ్జల కుమార్ నియమితులయ్యారు. ప్రచార కార్యదర్శులుగా గోపు రేవతి, కొత్తపల్లి రాజకుమారి, పిట్టల రాధిక ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బొక్క మహేందర్ రెడ్డి, భోగినేని వెంగళరావు, దొంతిరెడ్డి ఇంద్రసేనారెడ్డి, తిరుమారెడ్డి అజయ్ రెడ్డి, కొండ్ల శ్రీనివాస్, ఆకుల రాజు, అజ్మీర కిషోర్, అరిగెల భానుచందర్, కాలపల్లి ప్రవీణ్, వెన్న మౌనిక, జక్కుల కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఆలయ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.





