తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నిక

Written by telangana jyothi

Published on:

తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నిక

–  సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్.

వెంకటాపురంనూగూరు, తెలంగాణాజ్యోతి : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, చర్ల మండలం పరిధిలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో శనివారం తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో చర్ల మండల కమిటీ  గ్రామ నూతన కమిటీల ఎన్నికల సమావేశం నిర్వహించారు. కమిటీల ఏర్పాటు, సమావేశం వివరాలను శనివారం సాయం త్రం ములుగు జిల్లా వెంకటాపురంలో, రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ మీడియాకు విడుదల చేశారు. సమావేశం సంఘం నేత కొప్పుల రాంబాబు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ మాట్లాడుతూ వాడ బలిజ సంఘాన్ని బలోపేతం చేయాలని, మనమంతా ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వాడబలిజల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు. అలాగే చెరువులు, కుంటల్లో చేప పిల్లల ఉత్పత్తి కొరకు ప్రభుత్వం పథకం అందేలా కృషి చేయాలని కోరారు. ముందుగా యువకులు, విద్యావంతులుగా ఎదగాలన్నారు. కులం సర్టిఫికెట్లు, మత్స్య సొసైటీలో ప్రాతినిధ్యం, ఉండాలని, భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకుని వాడబలిజల అభివృద్ధికి కార్యచరణ పై చర్చించుకోవడం జరిగింది. వాడ బలిజ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలు,యువకుల సమక్షంలో చర్ల మండల కమిటీ మరియు గ్రామ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. చర్ల మండల అధ్యక్షులు గా ఎర్రావుల ప్రేమ్, ఉపాధ్యక్షులుగా బద్ది శ్రీనివాస్, కార్యదర్శిగా గగ్గూరి సాంబశివరావు, అధికార ప్రతినిధి ఎర్రం రాంబాబు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, గౌరవ అధ్యక్షులు చింతూరి వెంకట్రావు, ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, అధికార ప్రతినిధులు చింతూరి వెంకట్రావ్,తోట మల్లికార్జున్ రావు,చింతూరి గాంధీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోట ప్రశాంత్, ఉపాద్యాయులు బొల్లె నరేష్,వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సుగంధం రమేష్, ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు వాదం సమ్మయ్య,  తిరుపతి, కొప్పుల మహేష్, సంకపాప గణపతి తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now