ములుగులో పార్టీ బలోపేతానికి కృషిచేయాలి
గరికపాటి మోహన్ రావు
ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): భారతీయ జనతా పార్టీ ములుగు మున్సిపాలిటీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన ఇమ్మడి రాకేష్ యాదవ్ ఈ రోజు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీలో బీజేపీ పార్టీని అన్ని డివిజన్లలో బలోపేతం చేయాలని, పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని సూచించారు. రాబోయే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.






